FbTelugu

ఎన్నికల సంఘానికి సిగ్గులేదు: బండి సంజయ్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం పనిచేసిందని, దీనికి ఎన్నికల సంఘం సిగ్గుపడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
అనుభవం లేని వ్యక్తులను పోలింగ్ డ్యూటీ వేయగా, సుమారు 30 శాతం మంది విధులకు రాలేదన్నారు. ప్రభుత్వ టీచర్లను నియమిస్తే తమకు వ్యతిరేక ఫలితాలు వస్తాయని గుర్తించిన సీఎం కేసీఆర్, వారి బదులు ఎల్ఐసీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను నియమించిందని ఆరోపించారు. నాలుగు రోజులు సెలవు ఉండడంతో ఉద్దేశపూర్వకంగా ఎన్నికలు నిర్వహించారని ఆయన అన్నారు.

ఎన్నికల సంఘం నిర్లక్ష్యం మూలంగానే పోలింగ్ శాతం తగ్గిందని, సీఎం జేబు సంస్థగా మారిందని సంజయ్ ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో విఫలమైందని అన్నారు. సర్వేలన్నీ బీజేపీ గెలుస్తుందని చెప్పగా, టీఆర్ఎస్ కుట్రలు చేసిందన్నారు. ఓటింగ్ శాతం తగ్గించడానికి కుట్ర జరిగిందన్నారు. అధికార పార్టీ భయాందోళనకు గురిచేసినా ఓటర్లు బెదరలేదని ఆయన అన్నారు. కూకట్ పల్లి ఫోరం మాల్ ప్రాంతంలో రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ డబ్బులు పంచుతూ పట్టుబడ్డారని ఆయన విమర్శించారు. బీజేపీ నాయకులు పట్టుకునేందుకు ప్రయత్నించగా కారులో పారిపోయారన్నారు.
ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ ఆడింది ఆటగా, పాటగా వ్యవహరించారని, ఇక నుంచి ఎలా చూస్తారో చూస్తామని ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్ ఆటలు ఇక రాష్ట్రంలో సాగవని, సాగనివ్వమని ఆయన హెచ్చరించారు.

టీ న్యూస్ ఛానల్ అదొక బూత్ ఛానల్…
టీఆర్ఎస్ న్యూస్ ఛానల్ అనడం కంటే టీ న్యూస్ బూత్ ఛానల్ అని సంజయ్ విమర్శించారు. ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏడ పడుకున్నాడు అనేది చూపిస్తే బాగుంటుందన్నారు. బీజేపీ నాయకులపై ఆ ఛానల్ అసత్య ప్రచారం చేయడం పనిగా పెట్టుకుందని సంజయ్ ఆరోపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.