FbTelugu

ఏపీ పథకాలపై ఎన్నికల కోడ్

అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కొనసాగుతున్న పథకాలు, ప్రారంభించే పథకాలను నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి సర్క్యూలర్ జారీ చేసింది.

సోమవారం నాడు నెల్లూరు జిల్లాలో సీఎం వైఎస్.జగన్ ప్రారంభించనున్న అమ్మ ఒడి పథకం ఆగిపోయే సూచనలు కన్పిస్తున్నాయి. ఎన్నికల నియమావళి ప్రకారం అమల్లో ఉన్న పథకాలు, ప్రారంభించే పథకాలను పూర్తిగా నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు పలు పథకాలకు బ్రేక్ లు పడనున్నాయి. ఎన్నికల కమిషన్ సర్క్యూలర్ పై ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఇవాళ మంత్రులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తీవ్ర విమర్శలు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.