FbTelugu

రేపే రంజాన్: ముస్లిం మత పెద్దలు

ఢిల్లీ: ముస్లిం సోదరులు సోమవారం నాడు రంజాన్ పండగను జరుపుకోనున్నారు. పర్వదినాన్ని చేసుకోవాలని న్యూఢిల్లీలోని జామా మసీదు ఇవాళ సాయంత్రం ప్రకటించింది.

ఆదివారం రాత్రితో రంజాన్ మాసం పూర్తయినట్టని, సోమవారం పండగ చేసుకోవాలని జామా మసీదు షాహీ ఇమామ్ అహ్మదా షా బుకారీ సూచించారు. హైదరాబాద్ లోని రుహియత్ ఇలాల్ కమిటీ అధ్యక్షుడు అజీముద్దీన్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. కరోనా వ్యాప్తించకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు భక్తి శ్రద్దలతో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని వారు సూచించారు.

You might also like