FbTelugu

ఎన్‌.440కె వైరస్‌ పాతది: జవహర్ రెడ్డి

ప్రస్తుతం బి1.167, బి.1 వైరస్ స్ట్రెయిన్‌ల ప్రభావం
విజయవాడ: ఆంధ్రా రాష్ట్రంలో ఎన్440కె వైరస్ లేనే లేదని, దాని గురించి ప్రజల్లో అనవసర భయాందోళనకు గురి చేయవద్దని ఏపి స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్‌ డాక్టర్ కెఎస్‌సజవహర్ రెడ్డి అన్నారు.
ఇలాంటి విపత్కర, కల్లోల పరిస్థితుల్లో కొత్త వైరస్ లు వచ్చాయని భయబ్రాంతులకు గురి చేయవద్దని ఆయన కోరారు. రాష్ట్రంలో ఈ వైరస్‌ తీవ్రంగా ఉన్నట్టు ఎలాంటి నిర్థారణ జరగలేదని.. అందుకు సంబంధించిన పరిశోధన డేటా కూడా ఏమీ లేదని ఆయన కొట్టిపారేశారు.

వైరస్ జన్యుక్రమాలను తెలుసుకునేందుకు ప్రతి నెలా ఏపి నుంచి 250 నమూనాలను హైదరాబాద్ లోని సిసిసిఎంబి కి పరిశోధన కోసం పంపిస్తామన్నారు. మనమే కాకుండా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి నమూనాలు కూడా వస్తాయన్నారు. దక్షిణ భారత దేశం నుండి వెళ్లిన నమూనాల్లో ఎన్440కె (బి.1.36) వైరస్ ఉన్నట్లు గుర్తించారు. అవి కూడా 2020 జున్‌, జూలై నెలల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుంచి వెళ్లిన నమూనాల్లో గుర్తించారు తప్ప ఇప్పటివి కాదన్నారు. ఆ రకం వైరస్ ప్రభావం గత డిసెంబర్, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉందని జవహర్ రెడ్డి వివరించారు.
ఈ ఏడాది మార్చి నెలలో అది పూర్తిగా అంతర్థానమైందని, ఇప్పుడు దాని ప్రభావం అంతగా లేదన్నారు. ప్రస్తుతం బి1.167, బి.1 వైరస్ స్ట్రెయిన్‌ల ప్రభావం దక్షిణ భారత దేశంలో ఎక్కువగా ఉందని జవహర్ రెడ్డి వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.