FbTelugu

రేపటి నుంచే విద్యాసంస్థలు ప్రారంభం

* 10 నెలల విరామం తర్వాత ఓపెనింగ్
* తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి
* 9,10వ తరగతి విద్యార్థులకే అవకాశం
హైదరాబాద్‌: తెలంగాణలో రేపటి(సోమవారం) నుంచే విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో 10 నెలల పాటూ విద్యాసంస్థలు మూతపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడం, అలాగే వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో విద్యాసంస్థలను క్రమంగా ప్రారంభిస్తున్నారు.

రేపటి (ఫిబ్రవరి 01) నుంచి 9, 10 ఆపై తరగతులకు ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం అనుమతించింది. విద్యార్థులను స్కూళ్లకు పంపడానికి తల్లిదండ్రుల సమ్మతి తప్పని సరి అని అధికారులు స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.