FbTelugu

విద్యా సంస్థలు తెరిచే ఉంటాయి: విద్యా మంత్రి అశ్వత్థనారాయణ

బెంగళూరు: కరోనా రెండో వేవ్ నేపథ్యంలో విద్యా సంస్థలను మూసి వేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఉన్నత విద్యా మంత్రి డాక్టర్‌ అశ్వత్థనారాయణ స్పష్టం చేశారు. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ కొనసాగుతోందని తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ, వెనుకబడిన వర్గాల శాఖల పరిధిలోకి వచ్చే హాస్టళ్లలో, యూనివర్సిటీ ఆవరణల్లో కరోనా నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. డిగ్రీ పరీక్షలూ కొనసాగుతున్నాయని మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో కరోనా విస్తృతి తీవ్రంగా ఉన్నప్పటికీ విద్యార్థుల కోసం విద్యాలయాలు తెరిచి ఉంచుతున్నామని మంత్రి వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.