FbTelugu

టిఆర్ఎస్ ఎంపి ఇంటిపై ఈడి దాడులు

హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ ఎంపి, లోకసభ పక్షం నాయకుడు నామా నాగేశ్వర్ ఇళ్లు, కార్యాలయాల్లో ఈడి సోదాలు జరుగుతున్నాయి. జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసిన కేసులో ఆయనపై, కంపెనీలపై విచారణ జరుగుతోంది.

పలు బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో ఆ మొత్తం రూ.1,064 కోట్లకు చేరుకుంది. బ్యాంకు యాజమాన్యాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడి కేసు నమోదు చేసింది. మధుకాన్ కంపెనీ పేరుతో బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నారు. ఆ మొత్తాలను ఒప్పందం ప్రకారం ఇక్కడ వాడకుండా విదేశాలకు తరలించాడనే అభియోగాలు ఉండడంతో ఈడి రంగంలోకి దిగింది. 2019 మార్చి నెలలో సిబిఐ రాంచి ఎక్స్ ప్రెస్ వే లిమిటెడ్ పై కేసు నమోదు చేసింది. కెనరా బ్యాంకు కన్సార్టియం రూ.1000 కోట్ల రుణం మంజూరు చేసింది. తిరిగి చెల్లించకపోవడంతో కెనరా బ్యాంకు కన్సార్టియం రాంచి ఎక్స్ ప్రెస్ వే సిఎండి కె.శ్రీనివాస్ రావు, డైరెక్టర్లు ఎన్.సీతయ్య, ఎన్.పృథ్వి తేజ పై సిబిఐకి ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. రాంచి ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం కోసం మధుకాన్ కంపెనీ రాంచి ఎక్స్ ప్రెస్ వే లిమిటెడ్ స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేసినట్లు బ్యాంకు తెలిపింది. ప్రాజెక్టు మొబిలైజేషన్ కోసం మంజూరు చేసిన నిధులను కూడా మళ్లించినట్లు విచారణలో వెల్లడైంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.