FbTelugu

టిఆర్ఎస్ ఎంపి కి ఈడి సమన్లు

హైదరాబాద్: టిఆర్ఎస్ లోక్ సభ పక్ష నాయకుడు, ఖమ్మం ఎంపి నామా నాగేశ్వర్ రావుకు ఈడి సమన్లు జరీ చేసింది. హైదరాబాద్ ఈనెల 25వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడి సూచించింది.

రాంచి ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం కోసం తీసుకున్న రుణం మోసం కేసులో నాలుగు రోజుల క్రితం ఈడి ఆయన నివాసంతో పాటు కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. కెనరా బ్యాంకు కన్సార్టియం రుణం ఎగవేత కేసులో రాంచి ఎక్స్ ప్రెస్ వే లిమిటెడ్, మధుకాన్ గ్రూపులపై సిబిఐ కేసు 2019 మార్చిలో నమోదు చేసింది. బ్యాంకు నుంచి తీసుకున్నా రూ.1,064 కోట్లలో సుమారు రూ.264 కోట్లు విదేశాలకు దారి మళ్లించారనే విచారణలో వెలుగు చూడ్డంతో విచారించాల్సిందిగా ఈడికి సిఫారసు చేశారు. రుణం ఎగవేత, నిధులు విదేశాలకు తరలింపుపై విచారణ జరపాల్సిందిగా హైకోర్టు సుమోటా తీసుకుని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. ఎంపి నామా నాగేశ్వర్ రావు తో పాటు ఇతర డైరెక్టర్లకు కూడా సమన్లు జారీ అయ్యాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.