FbTelugu

జీవీకే ఆఫీసుల్లో ఈడీ తనిఖీలు

ముంబయి: జీవీకే గ్రూప్‌ అధినేత జీవీకే రెడ్డి, ఆయన కుమారుడు జీవీ సంజయ్‌రెడ్డికి చెందిన కార్యాలయాలు, ఇళ్లలో ఇవాళ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) తనిఖీలు నిర్వహించింది.

ముంబయి విమానాశ్రయ అభివృద్ధిలో రూ.705 కోట్ల మేరకు అవకతవకలు జరిగినట్టుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. ప్రివెంటీవ్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (పీఎంఎల్‌ఏ)లోని సెక్షన్‌ 3 కింద హైదరాబాద్‌, ముంబయిల్లో తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు.ఈ కేసులో ఎయిర్‌పోర్టు అథారిటీకి చెందిన కొందరు అధికారుల పేర్లు కూడా ఉన్నట్టు తెలిపారు.

You might also like