FbTelugu

ఈఎస్ఐ కుంభకోణంపై ఈడీ ఆరా

అమరావతి: అమరావతి రాజధాని భూ కుంభకోణాలపై ఈడీ విచారణ జరుగుతోంది. ఈడీ ప్రత్యేక బృందాలు నిన్నటి నుంచి విచారణ చేస్తున్నాయి.

ఏపీ సీఐడి అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అగ్రిగోల్డ్ స్కామ్ పై కూడా వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్ పై కూడా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో మాజీ మంత్రి కె.అచ్చెన్నాయుడు, మాజీ ఈఎస్ఐ డైరెక్టర్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అగ్రిగోల్డ్ కు సంబంధించిన ఆస్తులను గత ప్రభుత్వంలోని పెద్ద ఎత్తున కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజలకు చెందాల్సిన ఆస్తులను వక్రమార్గంలో కొట్టేశారని వైసీపీ నాయకులు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.