FbTelugu

ఎకో ఫ్రెండ్లీ విగ్రహం… నెట్టింట ఆదరణ

ముంబై: కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. బయటకు వెళ్లి తిరగలేని పరిస్థితి, మరొకరితో ప్రశాంతంగా మాట్లాడలేని దుస్థితి ఉంది. బతుకు భయం భయంగా మారింది.

ఈ పరిస్థితులను గమనించిన ఒక యువకుడు విన్నూత్న ఆలోచనతో పర్యావరణ హిత వినాయకుడిని తయారు చేయాలని నిర్ణయించాడు. షోలాపూర్ లోని బాల గ్రామానికి చెందిన ప్రతీక్ తండాలే ఆర్టిస్ట్ కు కొత్త ఆలోచన తట్టిందే తడవు అమలుపరిచాడు. చవితికి కొద్ది రోజుల ముందు తన వ్యవసాయ భూమిలో వినాయకుడి రూపాన్ని గీశాడు. ఆ ప్రకారంగా రంగు రంగుల విత్తనాలు చల్లాడు. వంద అడుగుల వెడెల్పు, 200 అడుగుల పొడవుతో ఉన్న భారీ విగ్రహ రూపం అందరినీ ఆకట్టుకుంటున్నది. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.

You might also like