FbTelugu

ఉప ఎన్నికలు ఇప్పట్లో లేవు: ఈసి ప్రకటన

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉందనే సాకు చూపిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసి) పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు వాయిదా వేసింది. కరోనా పరిస్థితిపై సమీక్షించిన ఈసి.. వైరస్ ఉధృతి తగ్గే వరకు ఉప ఎన్నికలు నిర్వహించడం కుదరదని స్పష్టం చేసింది.

దేశంలో దాద్రా నగర్‌హవేలీ, ఖండ్వా (మధ్యప్రదేశ్‌), మండి (హిమాచల్‌ ప్రదేశ్‌) లోక్‌సభ స్థానాలతో పాటు పలు రాష్ట్రాల్లోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు ఈసి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు సిండ్గి (కర్ణాటక), కల్కా, ఎలియాబాద్‌ (హర్యానా), వల్లభ్‌నగర్ (రాజస్థాన్‌)‌, రాజబల, మారైంగ్‌కెంగ్‌ (మేఘాలయా), ఫతేపూర్‌ (హిమాచల్‌ప్రదేశ్‌)లలో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇవే కాకుండా పశ్చిమ బెంగాల్ లో ఆరు నెలల వ్యవధిలోపు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. తాజాగా సిఎం గా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేసింది. ఆరు నెలల్లోపు ఏదో ఒక నియోజవర్గం నుంచి ఎన్నికైతే తప్ప సిఎం గా కొనసాగే అవకాశాలు లేవు.

You might also like

Leave A Reply

Your email address will not be published.