FbTelugu

ఈసి ఆదేశాలు బేఖాతర్… నేతల సంబురాలు

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను విజయం సాధించిన పార్టీలు బేఖాతర్ చేశాయి. కరోనా మహమ్మారి సమయంలో విజయోత్సవాలు నిర్వహించుకోవద్దని ఈసి స్పష్టం చేసింది.

అయినప్పటికీ గెలుపు దిశగా సాగుతున్న ఏ ఒక్క పార్టీ ఖాతర్ చేయడం లేదు. వీధుల్లోకి వచ్చి మిఠాయిలు పంచుతూ సంబురాలు చేసుకుంటున్నారు. కొన్న చోట్ల అయితే బాణసంచాలు కాల్చి పండుగ చేసుకోవడం గమనార్హం. పశ్చిమ బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్, తమిళనాడు లో డిఎంకె, కేరళలో ఎల్.డి.ఎఫ్ శ్రేణులు విజయోత్సవాల్లో మునిగి తేలుతున్నాయి. మాస్క్ ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా చేరి డప్పులు కొడుతూ నృత్యాలు చేస్తున్నారు. ఎన్నికల్లో లేని కోవిడ్ నిబంధనలు ఇప్పుడేంటి అని టిఎంసి, డిఎంకె కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి దాకా ఈసి నిద్రపోయిందని, ఫలితాలు అనుకూలంగా లేకపోవడంతో విజయోత్సవాలపై నిషేధం విధించిందని మండిపడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.