FbTelugu

ఈటల ఎవరి భూమి గుంజుకోలేదు: సర్పంచ్ లక్ష్మీ

మెదక్: రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ బలవంతంగా ఎవరి భూములు గుంజుకోలేదని, కబ్జాలు చేయలేదని అచ్చంపేట సర్పంచ్ లక్ష్మీ స్పష్టం చేశారు. మసాయిపేట మండలంలోని అచ్చంపేటలో ఇవాళ సర్వేకు అధికారులు రావడంతో ఆమె ప్రతిస్పందించారు.

తమ పిల్లల పెళ్లిళ్ల కోసం భూమి యజమానులు ఎకరాకు రూ.2 లక్షల చొప్పున విక్రయించారని ఆమె తెలిపారు. ఎప్పుడో విక్రయించిన భూమికి ఇప్పుడు మళ్లీ పేచి పెట్టి డబ్బులు అడగడం కరెక్టు కాదన్నారు. కొందరు వ్యక్తులు అత్యాశతో సిఎం కెసిఆర్ వద్దకు శుక్రవారం వెళ్లి ఫిర్యాదు చేశారని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం భూములకు ధరలు పెరగడంతో వీరి వెనకాల ఎవరో ఉండి కథ నడిపిస్తున్నారని అన్నారు. ఇలాంటి వ్యక్తుల మూలంగా తమ గ్రామ పరువుపోతున్నదని సర్పంచి సర్పంచ్ లక్ష్మీ వ్యాఖ్యానించింది. మా భూమిని కూడా అమ్మాలని అడగ్గా, విక్రయించలేదని ఆమె తెలిపింది. ఆమె టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు కావడం గమనార్హం.

You might also like

Leave A Reply

Your email address will not be published.