FbTelugu

ఈట‌ల హెచ్చ‌రిక ప్ర‌మాద సంకేత‌మా!

చైనాలో పుట్టిన క‌రోనా ప్ర‌పంచాన్ని కుదిపేస్తుంది. ఇండియాలో వైర‌స్ వ్యాప్తికి విదేశీయులు 10శాతం కార‌ణ‌మైతే.. 90శాతం వ‌ర‌కూ నిజాముద్దిన్ మ‌ర్క‌జ్ మసీదు  ప్రార్థ‌న‌కు వెళ్లొచ్చిన వార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం.

క్ర‌మంగా కుటుంబాల నుంచి స‌మాజంలోకి పాకిన వైర‌స్ తో స‌హ‌జీవ‌నం చేయాల్సి ఉంటుంద‌నేంత‌గా పాకిపోయింది. కోర‌లుచాచి హెచ్చ‌రిస్తుంది. అందుకే.. లాక్‌డౌన్ స‌డ‌లించినా వైర‌స్ వ్యాప్తి మ‌రింత పెరుగుతుంద‌నే ఆందోళ‌న లేక‌పోలేదు. తెలంగాణ వైద్య‌మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కూడా వ‌ల‌స కార్మికుల‌తో వైర‌స్ ముప్పు పొంచి ఉంద‌నే ఆందోళ‌న వ్య‌క్తంచేశారు.

విదేశాల నుంచి ల‌క్ష మంది.. స్వ‌దేశాల‌కు వెళ్లే వారు మ‌రో 25 ల‌క్ష‌ల మంది వ‌ర‌కూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నార‌ని అంచ‌నా. వీరిలో ఎంత‌మందికి వైర‌స్ సోకింద‌నేది లెక్క‌తీయ‌టం కూడా క‌ష్టంగా మారింది. అందుకే… 14 రోజుల పాటు నిర్బంధంగా క్వారంటైన్‌కు త‌ర‌లిస్తున్నారు. మూడు రోజులుగా వ‌ల‌స కార్మికుల‌ను త‌ర‌లించే కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. ఇప్ప‌టి వర‌కూ 30 మంది వ‌ర‌కూ పాజిటివ్ గా న‌మోదైన వారిలో వ‌ల‌స కార్మికులే ఉన్నారు. ఇది మున్ముందు దారితీయ‌బోయే ప‌రిస్థితుల‌కు వైర‌స్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉంటుంద‌నేందుకు కేవ‌లం ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. ఎటుచూసినా ఈట‌ల మాటలు.. రాబోయే రోజుల్లో నిజం అవుతాయ‌నేందుకు ప్ర‌స్తుతం న‌మోద‌వుతున్న కొవిడ్ 19 పాజిట‌వ్ కేసుల్లో అధిక‌శాతం వ‌ల‌స కూలీలు ఉండ‌ట‌మే.

You might also like