FbTelugu

మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్

హైదరాబాద్: మంత్రి ఈటల రాజేందర్ విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వేగంగా నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తున్నారు. శుక్రవారం నాడు ఈటల నుంచి వైద్య, ఆరోగ్య శాఖ ను తొలగిస్తూ ఆదేశాలు ఇప్పించారు.

ఆ మరుసటి రోజే అనగా ఆదివారం రాత్రి మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. భూ కబ్జా ఆరోపణలు వచ్చిన, రాజీనామా చేయకపోవడంతో ఏకంగా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయించారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ఆమోదముద్ర వేశారు. బర్తరఫ్ ప్రకటన రావడానికి మూడు గంటల ముందుగానే కొన్ని టివి ఛానళ్లలో ఈటలను బర్తరఫ్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలొచ్చాయి. ఛానళ్లలో చెప్పిన విధంగానే రాత్రి 9 గంటల ప్రాంతంలో గవర్నర్ కార్యాలయం నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.