FbTelugu

అగ్రరాజ్యంలో భూప్రకంపనలు

వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో నిన్న రాత్రి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అమెరికాలోని నేవడమినా పట్టణానికి 24 కిలోమీటర్ల దూరంలో 10.2 కిలోమీటర్ల లోతులో.. భూకంప కేంద్రం ఉన్నట్టుగా యూఎస్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది.

భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.2గా నమోదైందని తెలిపింది. భూమి కంపించడంతో ఇళ్లలోని ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప ప్రభావానికి జరిగిన ఆస్తినష్టం, ప్రాణనష్టంపై స్పష్టత రావాల్సి ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.