FbTelugu

దేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు

గాంధీనగర్: వాళ దేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గుజరాత్​లోని రాజ్​కోట్​లో ఇవాళ ఉదయం 7:40 గంటలకు భూమి కంపించినట్టుగా అధికారులు వెల్లడించారు. రిక్టరు స్కేలుపై తీవ్రత 4.5 గా నమెదైనట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. ఈశాన్య రాష్టం అసోంలో ఉదయం 7:57 గంటలకు భూమి స్వల్పంగా కపించించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 4.1గా నమోదైంది. హిమాచల్​ప్రదేశ్​లోని ఉనాలో ఉదయం 4:47 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 2.3గా ఉంది.

ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. భుకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రపంచంలోనే 6వ స్థానంలో ఉంది ఈశాన్య ప్రాంతం.

You might also like