FbTelugu

అర్ధరాత్రి నేపాల్ లో భూకంపం

గడిచిన అర్ధరాత్రి నేపాల్ లోని కఠ్మాండూ, కాస్కీ, పర్సా, సింధుపల్‌‌చోక్ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని నేపాల్ సిస్మోలాజికల్ సెంటర్ స్పష్టం చేసింది. అయితే ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనట్టు తెలిపింది.

అర్ధరాత్రి సమయంలో సంభవించిన ఈ భూకంప కేంద్రం డొలాకా జిల్లాలోని జుగు ప్రాంతంలో ఉన్నట్టుగా గుర్తించారు. కాగా ఈ భూకంపం వలన ప్రాణ, ఆస్థి నష్టం మాత్రం జరిగలేదని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే కశ్మీర్ లోనూ స్వల్పస్థాయిలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.

You might also like