FbTelugu

ఇరాన్ లో భూకంపం.. ఐదుగురు మృతి

Earthquake-in-Iran-kills-five-people

టెహ్రాన్‌: ఇరాన్‌లో సంభవించిన భూకంపం దాటికి ఐదుగురు మృతి చెందగా.. మరో 120 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాయువ్య ఇరాన్‌లో 5.9 తీవ్రతతో భూప్రకంపనలు నమోదయ్యాయి. పశ్చిమ అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌కు సమీపంలో 2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని యూఎస్‌ జియాలాజికల్‌ సర్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. 2003లో ఇరాన్‌లోని బామ్‌లో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించగా..26వేల మంది మృతి చెందారు.

You might also like