FbTelugu

అస్సాం తో పాటు బెంగాల్ లో భూకంపం

దిస్పూర్: ఆస్సాంలో బుధవారం ఉదయం సోనిపూర్ ప్రాంతంలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఉదయం 7.51 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పై 6.4 తీవ్రత నమోదు అయ్యింది.

ఆ తరువాత 8.13 గంటలకు, 8.34కు మూడోసారి ప్రకంపనలు వచ్చాయని పేర్కొంది. వరుసగా మూడుసార్లు ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మొదటిసారి వచ్చిన ప్రకంపనలతో ఉత్తర బెంగాల్ లోనూ భూకంపం వచ్చింది. మల్దా, జల్పాయిగురి, ముర్షిదాబాద్, కుచ్ బెహార్ తదితర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు బయటకు వచ్చారు. భూకంపంపై అస్సాం సిఎం సర్బానంద సోనావాల్ స్పందించారు. భారీగా కంపించిన ప్రాంతంలో భవనాలు, ఆస్తులు దెబ్బతిన్నాయన్నారు.
బిహార్ లోనూ బుధవారం రాత్రి 2.29 ప్రాంతంలో బలమైన ప్రకంపనలు రావడంతో కిసాన్ గంజ్, కతిహార్, కడ్జియా ప్రాంతంలో భూమి కంపించగా నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ మాత్రం ఇంకా ధృవీకరించలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.