FbTelugu

అరుణాచల్ లో భూకంపం

అంజవ్: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అంజమ్ జిల్లాలో సోమవారం తెల్లవారు జామున భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం మేల్కొని బయటకు పరుగులు తీశారు.

రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదు అయినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. వేకువ జామున 3.36 గంటలకు చాంగ్లాంగ్ కు 15 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయ దిశలో సంభవించింది.
ఈ భూకంపం మూలంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. ఈ నెల 6వ తేదీన తవాంగ్కు ప్రాంత సమీపంలోని 42 కిలోమీటర్ల దూరంలో స్వల్ప భూప్రకంపన సంభవించింది.

You might also like