FbTelugu

ప్రతి కానిస్టేబుల్ 24 గంటలు డ్యూటీ చేస్తున్నారు: సీపీ అంజనీకుమార్

హైదరాబాద్: లాక్ డౌన్ కారణంగా ప్రతి కానిస్టేబుల్ 24 గంటలూ పనిచేస్తున్నారని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఇవాళ నగరంలో పర్యటించారు. పోలీసులు వేసవి ఎండను సైతం లెక్కచేయకుండా డ్యూటీలు చేస్తున్నారని తెలిపారు.

చెక్ పోస్టుల వద్ద పోలీసులకు థర్మోసీల్డ్ వాటర్ కిట్స్ ను పంపిణీ చేశారు. కొంతమంది పోలీసులకు విధుల నిర్వహణలో గాయాలు కూడా అవుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. సిటీలో ఇంకా 100 పైగా కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

You might also like