FbTelugu

మంచు తుఫాన్ తో యూఎస్ అతలాకుతలం

వాషింగ్టన్: అమెరికాలో మంచు తుఫాన్ కారణంగా జనం అల్లాడిపోతున్నారు. ఎడతెరిపి నివ్వకుండా కురుస్తున్న మంచుతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.
ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. రోడ్లన్నీ మంచుతో కప్పేసి ఉండడంతో ఎక్కడివారే అక్కడే అన్న విధంగా ఉంది. మంచు తుఫాన్ కారణంగా విమానాలు రద్దు చేశారు. దేశంలో 15 కోట్ల మందికి మంచు ముప్పు పొంచి ఉందని నేషనల్ వెదర్ సర్వీసెస్ ప్రకటించింది. టెక్సాస్, ఒరేగాన్, అలబామా, కాన్సస్, మిసిసిపీ, కెంటకీ, ఒక్లహోమా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించారు.

మంచు కురవడం కారణంగా విద్యుత్ ప్లాంట్లు పనిచేయడం ఆగిపోయాయి. మంచినీరు సరఫరా చేసే పైపుల్లో నీరు గడ్డకట్టుకుపోవడం మూలంగా నీళ్ల సరఫరా ఆగిపోయింది. టెక్సాస్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో 40 లక్షల మందికి నీళ్లు, కరెంటు సరఫరా స్థంభించింది. లూసియానా, డల్లాస్ రాష్ట్రాలో మంచు తుఫాన్ భయంకరంగా ఉంది. కరెంటు పొదుపుగా వాడుకోవాలని, బలంగా చలిగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని టెక్సాస్ గవర్నర్ ప్రకటన జారీ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.