FbTelugu

ఎక్కడి నుంచైనా తెలంగాణ ఈ పాస్ సౌకర్యం

హైదరాబాద్‌: నిన్నటి వరకు ఎవరైనా తెలంగాణలోకి వచ్చేందుకు సంబంధిత రాష్ట్రాల నుంచి ఈ పాస్ తీసుకునేవారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడంతో తెలంగాణ పోలీసు శాఖ తన వెబ్ సైట్ లో కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది.

ఇకపై పొరుగు రాష్ట్రాల నుంచే తెలంగాణ పోలీసు వెబ్ సైట్ కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌లో ఆరు రకాలైన ప్రయాణికులకు ఈ-పాస్‌ జారీ చేయనున్నారు. నిన్నటి వరకు పొరుగు రాష్ట్రాల పోలీస్‌శాఖలు జారీ చేసే పాస్‌లతోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించేవారు. వాటిని పరిశీలించి చెక్ పోస్టుల వద్ద తెలంగాణ పోలీసులు అనుమతిస్తూ వస్తున్నారు. హైదరాబాద్ లో వైద్య సౌకర్యాలు బాగుండడంతో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి ఎక్కువగా వస్తున్నారు. కాగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం  తెలంగాణాలోకి వచ్చేందుకు ఈ-పాస్‌ల జారీ ప్రక్రియను తాత్కాలికంగా  నిలిపివేసింది. ఈ రాష్ట్రమే కాకుండా మిగతా రాష్ట్రాల్లోనూ సాంకేతిక కారణాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులే ఈ పాసులు జారీ చేస్తున్నారు.

కొత్త ఫీచర్ వివరాలు ఇవే…

* ఆసుపత్రిలో చికిత్స కోసం

* ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న విద్యార్థులు తిరిగొచ్చేందుకు

* విమాన ప్రయాణికులను విమానాశ్రయంలో దింపేందుకు

* స్వరాష్ట్రానికి చెందిన కుటుంబాలు వచ్చేందుకు

* వివాహం, కుటుంబ సభ్యుల అంత్యక్రియల హాజరు కోసం.

You might also like

Leave A Reply

Your email address will not be published.