FbTelugu

కరోనా… 3నెలల తరువాతే వ్యాక్సిన్: కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్ నుంచి కోలుకున్నవారు మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జాతీయ వ్యాక్సిన్ నిపుణుల కమిటీ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

తొలి డోసు తర్వాత కరోనా వస్తే మూడు నెలలకు రెండో డోసు వేయించుకోవాలని సూచించింది. తీవ్రంగా జబ్బుపడి కోలుకున్న వారికి 4-8 వారాల తర్వాతే ఇవ్వాలని పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల తర్వాత, ఆర్‌.టి.పి.సి.ఆర్‌ పరీక్షలో నెగటివ్‌ వచ్చిన రెండు వారాల తర్వాత రక్తదానం చేయవచ్చని వెల్లడించింది. వ్యాక్సిన్ వేయించుకునే ముందు కరోనా నిర్థారణ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.