FbTelugu

రేపటి నుంచి రైళ్లలో ఈ-కేటరింగ్‌ సేవలు

న్యూఢిల్లీ : రేపటి నుంచి ఎంపిక చేసిన రైల్వే మార్గాల్లో ఈ-కేటరింగ్‌ సేవలు అమలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఐఆర్‌సీటీసీ (భారతీయ రైల్వే కేటరింగ్‌, పర్యాటక కార్పొరేషన్‌) రేపటి (ఫిబ్రవరి 01) నుంచి ఈ-కేటరింగ్‌ సేవలను ప్రారంభించనుంది.

మొదటి దశలో 62 స్టేషన్లలో ఈ సేవలను తిరిగి ప్రారంభించనుంది. ప్రయాణికులు ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌ యాప్‌ ద్వారా  తమ ఆహారాన్ని పొందవచ్చునని తెలిపారు. ఈ యాప్ ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి గాని యాప్‌ స్టోర్‌ నుంచిగానీ పొందవచ్చునని స్పష్టం చేశారు. అలాగే www.ecatering.irctc.co.in వెబ్ సైట్‌ ద్వారా కూడా పీఎన్‌ఆర్‌ను ఎంటర్‌ చేసి ఆహారాన్ని ఆర్డర్‌ చేయవచ్చునని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.