FbTelugu

నేటి నుంచి ద్వారక తిరుమల ఆలయం బంద్

పశ్చిమగోదావరి: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తీవ్రంగా పెరగిపోతున్న నేపథ్యంలో నేటి నుంచి ద్వారక తిరుమల ఆలయాన్ని మూసివేయనున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ నెల 31 వరకు చిన వెంకన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న తరుణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే అనేక ఆలయాల్లో పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతిస్తున్నారు.

You might also like