FbTelugu

ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ దర్శనం లేదా?

విజయవాడ: కనకదుర్గ అమ్మవారి దర్శనం ఇప్పట్లో ఉండే అవకాశాలు కన్పించడం లేదు. కొండ దిగువున కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత అధికంగా ఉండడంతో మరికొద్ది రోజుల పాటు దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయానికి భక్తులను అనుమతించాలా లేదా అనే దానిపై దుర్గగుడి అధికారులు తర్జన బర్జనపడుతున్నారు. కంటైన్ మెంట్ జోన్, బఫర్ జోన్ కింద ఆలయం వస్తుందో తెలపాలని జిలాలా కలెక్టర్ కు దుర్గగుడి ఈఓ సురేష్ బాబు లేఖ రాశారు. దేవాదాయ శాఖ నుంచి రైడా అనుమతుల కోసం దుర్గగుడి అధికారులు వేచి చూస్తున్నారు.

కొండ వెనకాల విద్యాధరపురం, కుమ్మరిపాలెం సెంటర్,  భవానీపురం, కొండ‌ దిగువున మల్లికార్జునపేట ఇతర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

You might also like