FbTelugu

మందకొడిగా పోలింగ్… 1 వరకు 18 శాతమే1

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో పోలింగ్ అనుకున్నంత స్పీడ్ గా సాగడం లేదు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 18.20 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
మూడు గంటల కల్లా పోలింగ్ పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

వరుస సెలవులు రావడంతో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు తమ స్వగ్రామాలకు తరలివెళ్లారు. ఓటు వేయడంతో ఈ రోజు సెలవు ఇస్తే కూడా వినియోగించుకోకుండా ఊర్లకు తరలివెళ్లడం పలు పార్టీల అభ్యర్థులకు నిరాశ కలిగించింది. వివేకానంద నగర్ లో 8 శాతం, హైదర్ నగర్ లో 9 శాతం నమోదు కావడం అభ్యర్థులకు గుబులుపుట్టిస్తున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.