FbTelugu

పశువులకు నిప్పంటించిన తాగుబోతులు!

తూర్పుగోదావరి: ఫుల్లుగా తాగిన కొందరు తాగుబోతులు మద్యం మత్తులో పశువులశాలకు నిప్పు పెట్టడంతో ఓ గేదె మృతిచెందిన ఘటన జిల్లాలోని ఉయ్యాలవారి మెరకలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం మత్తులో కొందరు దుండగులు పశువులశాలకు నిప్పుపెట్టడంతో మంటల్లో చిక్కుకుని ఓ గేదె మృతి చెందింది. తన గేదె మృతి చెందడంతో రైతు సత్యనారాయణ కుప్పకూలాడు. దీంతో రైతును చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.