FbTelugu

మాజీ మంత్రి కొడుకు ఇంట్లో డ్రగ్స్ సోదాలు…

బెంగళూరు: కర్నాటక మాజీ మంత్రి, దివంతగత నాయకుడు జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్య అల్వా నివాసం లో సెంట్రల్ క్రైమ్ బ్రాంచి (సీసీబీ) పోలీసులు సోదాలు నిర్వహించారు.

హెబ్బాల్ ప్రాంతంలో ఆదిత్యకు చెందిన హౌస్ ఆఫ్ లైఫ్ లో సెర్చి వారెంట్ తో సోదాలు చేపట్టారు. నగరంలో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్న వారి ఇళ్లలో ఈ సోదాలు చేస్తున్నారు. ఆదిత్య తన ఇంట్లో తరచూ రేవ్ పార్టీలు ఇస్తారనే పక్కా సమాచారం పోలీసులకు లభించింది. కర్నాటక సినిమా రంగాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో కూడా ఈయన పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. ఆదిత్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.