FbTelugu

కోవాగ్జిన్ కు ఇండియాలోనే ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు పూర్తిస్థాయి లైసెన్స్ ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) నిరాకరించింది.

అత్యవసర వినియోగానికి ఈ ఏడాది ప్రారంభంలో డిసిజిఐ అనుమతించిన విషయం తెలిసిందే. ఐసిఎంఆర్ తో కలిసి భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన విషయం తెలిసిందే. పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చేందుకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. గర్భిణీలకు ఎట్టి పరిస్థితుల్లో వ్యాక్సిన్ వినియోగించవద్దని స్పష్టం చేసింది. భారత్ తో పాటు మరికొన్ని దేశాల్లో కోవాగ్జిన్ అత్యవసర వినియోగం కింద వాడుతున్నారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కావడంతో ఇటీవలే భారత్ బయోటెక్ డిసిజిఐ కు దరఖాస్తు చేసుకున్నది. అమెరికాలో కూడా యు.ఎస్.ఎఫ్.డి.ఏ కూడా కోవాగ్జిన్ వినియోగానికి అనుమతించడం లేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.