FbTelugu

డ్రగ్స్ కేసుపై 4 వారాల్లో కౌంటర్ వేయాలి: హైకోర్టు

హైదరాబాద్: డ్రగ్స్ తో సంబంధాలున్న వారి విచారణ నివేదికలను దాచి పెట్టాల్సిన అవసరమేముందని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. డ్రగ్స్ పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏం చేస్తోందని హైకోర్టు మండిపడింది.

ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు ను తదుపరి విచారణ కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని కాంగ్రెస్ ఎంపి ఎ.రేవంత్ రెడ్డి వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. 2016లో నమోదైన డ్రగ్స్ కేసులను సిబిఐ, ఈడికి ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి తరఫున న్యాయవాది బొల్లు రచనా రెడ్డి తెలిపారు. తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ డ్రగ్స్ కేసుల వివరాలు అడిగినా ఇవ్వడం లేదని ఈడీ హైకోర్టుకు తెలిపింది. ఎఫ్ఐఆర్ లు, ఛార్జిషీట్లు, వాంగ్మూలాలు ఇచ్చేలా ఎక్సైజ్ కమిషనర్ ను ఆదేశించాలని కోరింది. ఈడి కి వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సరైన సమాధానం చెప్పకపోవడంతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రాన్ని ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.