FbTelugu

రెండువారల్లో ఔషధ ప్రయోగ ఫలితాల

జెనివా: కరోనా ను నయం చేసే ఔషధాలపై జరుగుతున్న ప్రయోగాల ఫలితాలు రెండువారాల్లో తుది దశకు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ టెడ్రోస్ అథనోమ్ ప్రకటించారు.

సుమారు 39 దేశాలలో 5వేల మందికి పైగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయన్నారు. రెమిడెసివర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, లోపినావిర్, రిట్రోనావిర్, ఇంటర్ ఫెరాన్ వంటి ఔషధాలను మానవులపై ప్రయోగించి చూస్తున్నారు. ఈ మందులను ఇచ్చిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది కూడా పరిశీలిస్తున్నారని టెడ్రోస్ తెలిపారు.

హైడ్రాక్సీ క్లోరోక్విన్ పై క్లినికల్ ట్రయల్స్ నిలిపివేస్తున్నట్లు గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అయినప్పటికీ కరోనా వైరస్ సోకకుండా దీన్ని ముందుగా తీసుకోవచ్చా అనే దానిపై ప్రయోగాలు జరుగుతున్నాయిన ఆయన వివరించారు.

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందనేది ఇప్పుడే అంచనా వేయడం అవివేకం అవుతుందని డబ్ల్యూహెచ్ఓ ఉన్నతాధికారి మైక్ ర్యాన్ అభిప్రాయపడ్డారు. మనుషులపై ప్రభావం ఏ మేరకు చూపుతుందనేది ఈ సంవత్సరం చివరకు కాని వెల్లడికాదన్నారు.

You might also like