FbTelugu

సర్కార్ నుంచి దమ్మిడి సాయం లేదు: ఆనందయ్య

నెల్లూరు: కొన్ని ఆటంకాల వల్ల కరోనా ఔషధ పంపిణీ సవ్యంగా సాగట్లేదని, పంపిణీకి సరపడా వనరులు సమకూరడంలేదని ఆనందయ్య ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సౌకర్యం, ఔషధ తయారీకి యంత్ర సామాగ్రి లేకపోవడం సమస్యగా ఉందన్నారు.
ప్రభుత్వం నుంచి అనుమతులే తప్ప నయాపైస కూడా సహకారం లేదని ఆయన పెదవి విరిచారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే అన్ని ప్రాంతాలకు ఔషధం అందిస్తామన్నారు.

ఇవాళ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకే ఔషధం అందిస్తామని, కృష్ణపట్నంలో ఔషధ పంపిణీ కొనసాగుతోందన్నారు. స్థానికేతరులు ఎవరూ కృష్ణపట్నం రావద్దని ఆనందయ్య కోరారు. మందు అసలైనదేనా, నకిలీదా అంటూ పరీక్షలు చేయించి నానా ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వం అసలైన సమయంలో మౌనంగా ఉండడం శోచనీయని ప్రజలు విమర్శిస్తున్నారు. సాఫీగా జరిగిపోతున్న కార్యక్రమానికి లేనిపోని ఆటంకాలు సృష్టించిందని నెల్లురు జిల్లా వాసులు ఆరోపిస్తున్నారు. నాణ్యత పేరుతో విచారణల మీద విచారణలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, నివేదికలు వచ్చిన తరువాత చేతులెత్తేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.