FbTelugu

డ్రగ్ కేసు… కన్నడ నటి రాగిణి అరెస్టు

బెంగళూరు: కన్నడ నటి రాగిణి ని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచీ పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. మాదక ద్రవ్యాల వినియోగంపై విచారణ నిమిత్తం ఆమెను సీసీబీ కార్యాలయానికి తరలించారు.

గురువారం నాడు నోటీసులు జారీ చేసిన పోలీసులు ఇవాళ ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రాగిణితో పాటు ఆమె స్నేహితురాలిని కూడా అరెస్టు చేశారు. జర్నలిస్టు ఇంద్రజిత్ లంకేష్ కన్నడ సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగంపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గురువారం నాడు ఆయన సీసీబీ పోలీసులకు ఆధారాలు సమర్పించారు.

You might also like