FbTelugu

ముంచుకొస్తున్న యాస్ తుఫాన్

విశాఖపట్నం: రాష్ట్రానికి మరో తుఫాన్ ముంచుకొస్తున్నది. ఇప్పటికే తౌక్టే తుఫాన్ తో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురవగా, మహారాష్ట్ర, గుజరాత్ లో పలు ప్రాంతాలలో భారీగా నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.

ఈ నెల 22న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది. అల్పపీడనం బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి యాస్ తుఫానుగా నామకరణం చేశారు. ఈనెల 26న బెంగాల్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. వేసవికాలం ముగియక ముందే తుఫాన్లు రావడంపై ప్రజలు విస్మయం చెందుతున్నారు. సాధారణంగా జూన్, జూలై నెలలో వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.