FbTelugu

డ్రైవింగ్‌ లైసెన్సు చెల్లుబాటు తేదీ పొడిగింపు

ఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో వాహనాల డ్రైవింగ్‌ లైసెన్సు సహా ఇతర పత్రాల చెల్లుబాటు గడువును ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు కేంద్రం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ప్రకటించింది.

ఫిబ్రవరి 1, 2020 నాటికి గడువు తీరే ఫిట్‌నెస్‌, రహదారి అనుమతి ఇలా వాహన సంబంధిత అన్ని పత్రాలు ఇక డిసెంబర్‌ నెలాఖరు వరకు వరకు చెల్లుబాటు అవుతాయి. అప్పటి వరకు వీలున్న వారు సమయాన్ని బట్టి రెన్యూవల్ చేసుకోవచ్చు,

You might also like