FbTelugu

గ్రేటర్ లో నీళ్లు ఫ్రీ: సీఎం కేసీఆర్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉచిత పథకాలు ప్రకటించారు.
ఇవాళ టీఆర్ఎస్ భవన్ లో సీఎం కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ మెనిఫెస్టోను విడుదల చేశారు. డిసెంబర్ నుంచి నల్లా నీళ్ల బిల్లలు చెల్లించాల్సిన పని లేదని, 98 శాతం మంది ప్రజలకు ఉచితంగా నీళ్లు సరఫరా చేస్తామని ప్రకటించారు. ప్రతి కుటుంబానికి 20వేల లీటర్ల వరకు దోబీ ఘాట్లు, లాండ్రీలకు, నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్ ను ఆయన ప్రకటించారు.
లాక్ డౌన్ సమయంలో మోటార్ వాహనాల పన్ను రద్దు చేస్తామని సీఎం తెలిపారు. జంటనగరాల్లో నీటి కోరత లేదని, పెట్టుబడులు మరింతగా వచ్చేలా కార్యాచరణ రూపొందించామన్నారు. త్వరలో జీహెచ్ఎంసీ చట్టాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.