FbTelugu

డి.ఆర్.డి.ఒ 2డిజి మందు వచ్చేసింది…

విడుదల చేసిన కేంద్ర మంత్రులు రాజనాథ్, హర్షవర్థన్
న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్ సోకిన వారు త్వరితగతిన కోలుకునేందుకు మరో మందు అందుబాటులోకి వచ్చింది. డి.ఆర్.డి.ఒ అభివృద్ధి చేసిన 2డిజి మందును కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్థన్ తో కలిసి విడుదల చేశారు.

తొలి బ్యాచ్ 2డిజి సాచెట్లను మంత్రి హర్షవర్థన్ కు రాజనాథ్ అందచేయగా వాటిని ఢిల్లీ ఏయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హర్షవర్థన్ మీడియాతో మాట్లాడుతూ, 2డిజి మందుతో కరోనా వ్యాధిగ్రస్థుడి రికవరీ సమయం తగ్గడంతో పాటు ఆక్సిజన్ అవసరం కూడా తగ్గుతుందని తెలిపారు. తొలి విడతో 10వేల సాచెట్లు అందుబాటులోకి తెచ్చారని, మే 27, 28 తేదీల్లో మరిన్ని సాచెట్లు విడుదల అవుతాయన్నారు. జూన్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని, ఇంకా ధరను ఖరారు చేయలేదన్నారు. కరోనా వ్యాధి కట్టడి కోసం డి.ఆర్.డి.ఓ ఏడాది పాటు శ్రమించి ఈ మందును తీసుకువచ్చిందని ఆయన అభినందించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.