FbTelugu

కుంగ్ ఫ్లూ పై డ్రాగన్ వార్నింగ్

బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుంగ్ ఫ్లూ పేరు ను వెనక్కి తీసుకోవాలని లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదని చైనా హెచ్చరించింది.

ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ తమ కుట్రగా అమెరికా ప్రచారం చేయడం సరైంది కాదని స్పష్టం చేసింది. అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న తరుణంలో చైనాపై లేనిపోని విమర్శలు చేసి లబ్ధి పొందాలని ట్రంప్ భావిస్తున్నారంటూ భగ్గమంది.

రెండు రోజుల క్రితం ఓక్లహామాలో నిర్వహించిన తొలి ఎన్నికల ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. కరోనా వైరస్ చైనా వైరస్ అని మొదలు పెట్టిన ట్రంప్ చివరకు కుంగ్ ఫ్లూ వైరస్ గా నిర్దారించారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ కు 19 రకాల పేర్లు పెట్టానని ట్రంప్ తెలిపారు. ఏ పేరు పెట్టినా చైనా నుంచి అభ్యంతరాలు రావడంతో చివరగా కుంగ్ ఫ్లూ గా నామకరణం చేసినట్లు చెప్పారు. తాజాగా పెట్టిన పేరుపై చైనా తీవ్రంగా స్పందించింది.

You might also like