FbTelugu

డాక్టర్ సుధాకర్ కేసు సీబీఐకి అప్పగింత

8 వారాల్లో విచారణ జరపాలని హైకోర్టు ఆదేశం

అమరావతి: డాక్టర్ సుధాకర్ రావు కేసు సీబీఐ కి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐ కి హైకోర్టు ఆదేశించింది.

గత శనివారం విశాఖపట్నంలో పోలీసులు అమానవీయంగా డాక్టర్ సుధాకర్ ను అరెస్టు చేసి తీసుకువెళ్లడంపై హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించింది. ఇవాళ మరోసారి విచారణ జరిపింది. విశాఖ పోలీసుల పై కేసు నమోదు చేసి విచారణ జరపాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుధాకర్ శరీంరపై గాయాలున్న విషయం సెషన్స్ మెజిస్ట్రేట్ నివేదికలో ఉండగా, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో గాయాల ఊసే లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇచ్చే నివేదికపై నమ్మకం లేదని వ్యాఖ్యానించింది. దీని వెనకాల భారీ కుట్ర దాగి ఉందని, ఈ కారణాలతో సీబీఐ కి కేసు అప్పగిస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది.

You might also like