FbTelugu

రష్యా వ్యాక్సిన్ తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం

హైదరాబాద్: స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కు భారత ప్రభుత్వం అనుమతి లభిస్తే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రయోగాత్మక పరీక్షలు, సరఫరా చేస్తుందని రష్యా కు చెందిన ఆర్డీఐఎఫ్ సంస్థ ప్రకటించింది.

కరోనా వైరస్ వ్యాక్సిన్ ను రష్యాకు చెందిన ఆర్డీఐఎఫ్ స్పత్నిక్ వీ పేరుతో అభివృద్ధి పర్చిన విషయం తెలిసిందే. భారత్ లో సరఫరా చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో ఒప్పందం కుదుర్చుకున్నది. భారత ప్రభుత్వం అనుమతి లభించగానే వంద మిలియన్ల డోసులు అందచేయనున్నట్లు ప్రకటించింది. ఇటీవలే రష్యాలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే.

You might also like