FbTelugu

కొత్త కరోనా అప్రమత్తంగా ఉండాలి : డాక్టర్ రణదీప్ గులేరియా

న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో వ్యాపిస్తున్న కొత్త కరోనా రకాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వీటికి అత్యంత సులువుగా వ్యాప్తించే లక్షణాలు కలిగి ఉన్నాయని పేర్కొన్నారు.

రణదీప్ గులేరియా మాట్లాడుతూ, కరోనా వైరస్ సోకి తగ్గిన వారిలో, యాంటీ బాడీస్ ఉన్నవారిలో కూడా మళ్లీ వైరస్ లు సోకేందుకు కొత్త వైరస్ లు కారణం కాగలవు అని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా 240 రకాల కరోనా వైరస్ లు ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేశంలో సమూహ వ్యాధి నిరోధకత అనే భావనే ఓ మిధ్య అని కొట్టి పారేశారు. కొత్త కొత్త కరోనా రకాలు విజృంభిస్తున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, స్వీయ నియంత్రణ పాటించాలని రణదీప్ అన్నారు.

మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్, పంజాబ్, చత్తీస్ గఢ్, కేరళలో గత వారం రోజులుగా కేసుల తాకిడి పెరిగింది. వైరస్ పరివర్తన చెందడం మూలంగా వ్యాధి నిరోధకతన నుంచి తప్పించుకోగల శక్తి లభిస్తోందని ఆయన వివరించారు. టీకా వేసుకున్నా, వ్యాధి వచ్చిపోయి తగ్గడం వల్ల, రోగ నిరోధక శక్తి ఉన్నవారికి కూడా మరోసారి వ్యాధి వచ్చేలా ఈ వైరస్ లు చేస్తాయని అన్నారు. నియంత్రణ మార్గం ఒకటేనని, భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడడం వంటి అన్ని నియమాలను అమలు చేయాల్సిందేనని రణదీప్ గులేరియా స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.