FbTelugu

డాక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూత

హైదరాబాద్‌: హైదరాబాద్ నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.

కృష్ణా జిల్లా పెదముత్తేవిలో వ్యవసాయ కుటుంబంలో కాకర్ల సుబ్బారావు 1925 జనవరి 25న జన్మించారు. పాఠశాల విద్య చల్లపల్లిలో చేసి కళాశాల విద్యాభ్యాసం బందరు లోని హిందు కళాశాలలో 1937-1944 సంవత్సరాల మధ్య చదివారు. విశాఖపట్టణం ఆంధ్ర వైద్య కళాశాలలో చేరి వైద్య పట్టాను 1950 లో అందుకున్నారు. 1951 సంవత్సరంలో హౌస్‌ సర్జన్సీ చేసిన తరువాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్ళాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.