FbTelugu

మేమూ నిస్సహాయులమే…!: డాక్టర్ గిలాడి తృప్తి

ముంబయి: ముంబయి మహానగరంలో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని, ఆసుపత్రులలో మంచాల కొరతతో పాటు ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని, వైద్యులతో పాటు వారి బంధువులకూ కూడా పడకలు దొరకడం లేదంటే ఏ విధంగా ఉందో ఊహించండి అని డాక్టర్ గిలాడి తృప్తి ఆందోళన వ్యక్తం చేసింది.

మాస్క్ ధరించి, స్వీయ నియంత్రణ పాటిస్తేనే ఈ మహాగండం నుంచి బయటపడతామని ఆమె షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. దేశంలో కరోనా విలయం భయానకంగా ఉందని, ఇక్కడ అక్కడ అనేది లేకుండా అన్ని ప్రాంతాలను చుట్టేసిందని ఆమె హెచ్చరించారు. నాకు కరోనా రాలేదు, నేను బలంగా ఉన్నాను అని అనుకుంటే పొరపడినట్టేనని ఆమె వ్యాఖ్యానించారు. యువకులు కూడా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. మీకు అలాంటి పరిస్థితి రాకూడదని దేవుడిని కోరుకుంటున్నాను. వైరస్ ను తేలిగ్గా తీసుకోవద్దని, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని గిలాడి తృప్తి కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.