FbTelugu

నా హాస్పిటల్… నా ఇష్టం…!

లక్నో: విపత్కర పరిస్థితుల్లో ఉన్న కరోనా రోగులు అంటే ఆ ప్రైవేటు హాస్పిటల్ యజమానికి లెక్కే లేదు. నా హాస్పిటల్ నా ఇష్టం అనే విధంగా వ్యవహరించాడు. మాక్ డ్రిల్ కోసం ఐదు నిమిషాల పాటు ఆక్సిజన్ నిలిపేసి పదుల సంఖ్యలో మృతులకు కారణమయ్యాడు.
ఈ ఘటనపై హాస్పిటల్ యజమాని మాట్లాడిన ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆగ్రా లో పారాస్ హాస్పిటల్ లో కరోనా రోగులు చికిత్స వార్డు ఉంది. ఈ వార్డులో పలువురు చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్ యజమాని డాక్టర్ అరింజయ్ జైన్ ఏప్రిల్ 27వ తేదీన మాక్ డ్రిల్ నిర్వహించారు. ఐదు నిమిషాల పాటు నిర్వహించిన ఈ మాక్ డ్రిల్ పలువురి రోగుల శరీరాలు నీలం రంగులోకి మారాయి. మరొకొందరి ప్రాణాలు గాల్లో కలిశాయి. ఊపిరి ఆడక 22 మంది శరీరాలు నీలం రంగులోకి మారాయని, మరికొందరు బతికే అవకాశం లేదని డాక్టర్ అరింజయ్ జైన్ మాట్లాడిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆక్సిజన్ లేకపోతే మనుగడ కష్టమని చెప్పానని, స్వంతంగా ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటుచేసుకోవాని కోరినట్లు ఆయన తెలిపారు.

ఈ ఆడియో ను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా వాద్రా ట్వీట్ చేశారు. బిజెపి పాలనలో ఆక్సిజన్, మానవత్వం రెండింటికి కొరత ఏర్పడిందన్నారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె తో పాటు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆక్సిజన్ లేక హాస్పిటల్ లో మరణించిన కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులెవరని ప్రధాని నరేంద్ర మోదీ, యుపి సిఎం యోగి ఆదిత్యానాథ్ ను ఆమె ప్రశ్నించారు. ఈ ఆడియో సంచలనంగా మరాడంతో యుపి ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ చేసతున్నామని ఆగ్రా జిల్లా మెజిస్ట్రేట్ ప్రభు సింగ్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.