FbTelugu

స్పీడ్ గా డౌన్ లోడ్ అవుతున్న చింగారి

టిక్ టాక్ యాప్ పై వేటు పడడంతో పలువురు ప్రత్యామ్నాయ యాప్ లను వెదుకుతున్నారు. ఇండియాకే చెందిన చింగారి యాప్ ను పెద్ద ఎత్తున డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.
చింగారి యాప్ ను భారతీయులే తయారు చేశారు. సురక్షితంగా, స్పష్టంగా ఉండడంతో లక్షలాది మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, బెంగాళీ, మరాఠీ, గుజరాతీ, కన్నడ, పంజాబీ, తమిళం, మళయాళం భాషల్లో వినియోగించుకునేలా రూపొందించారు.

స్వదేశీయులు రూపొందించిన చింగారిని ప్రోత్సహించాలంటూ పలువురు కోరుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దీన్ని డౌన్ లోడ్ చేసుకోవడమే కాకుండా, ఫీచర్స్ కూడా వివరించారు. అయితే ఇంత వరకు టిక్ టాక్ యాప్ ను ఆనంద్ మహీంద్రా ఉపయోగించలేదు. ఇప్పటి వరకు 2.5 మిలియన్ల మంది చింగారిని అప్పుడే డౌన్ లోడ్ చేసుకున్నారు.

You might also like