FbTelugu

వైద్యసిబ్బందికి జీతాలు రెట్టింపు !

వైద్యసిబ్బందికి జీతాలను రెట్టింపు చేస్తూ హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఓ పక్క కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. వైద్యఆరోగ్య సిబ్బంది ప్రమాదపు అంచున తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్నారు.

వారి సేవలను గుర్తించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చే జీతాలను డబుల్ చేస్తున్నట్టు ప్రకటించింది. జీతాలు రెట్టింపైన వారు వీరే.. డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, అంబులెన్స్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు. దీనికి సంబంధించి హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ కట్టర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా విపత్తు కొనసాగినన్ని రోజులు డబుల్ సాలరీ ఇవ్వనున్నట్టు తెలిపారు.

You might also like